పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తుండడం రాష్ట్రపతికి అవమానం: రాహుల్ గాంధీ

  • నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త పార్లమెంటు
  • మే 28న ప్రారంభోత్సవం
  • రాష్ట్రపతితో ప్రారంభోత్సవం చేయించాలన్న రాహుల్ గాంధీ
భారతదేశ నూతన పార్లమెంటు భవన సముదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభోత్సవం చేయించకపోవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఇది దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించడమేనని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని కనీసం ఆహ్వానించకపోవడం కూడా అవమానకరం అని పేర్కొన్నారు. పార్లమెంటు భవనం అహంకారం అనే ఇటుకలతో నిర్మితం కాలేదని, రాజ్యాంగ విలువలతో నిర్మితమైందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

కాగా, ఈ నెల 18న ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారభించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. మే 28న కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరగనుంది.


More Telugu News