తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తాపడిన విద్యుత్ బస్సు

  • మొదటి ఘాట్ రోడ్డులో 30వ మలుపు వద్ద ఘటన
  • డివైడర్ ను ఢీకొట్టిన బస్సు
  • ఆరుగురికి తీవ్ర గాయాలు... రుయా ఆసుపత్రికి తరలింపు
  • ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు
తిరుమల ఘాట్ రోడ్డులో ఓ విద్యుత్ బస్సు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా, వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన ఎస్పీఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. 

విద్యుత్ బస్సు తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా మొదటి ఘాట్ రోడ్డు 30వ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది. తిరుమల, తిరుపతి మధ్య ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జగన్ గతేడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే.


More Telugu News