బెంగళూరును కుమ్మేసిన భారీ వర్షం... నీటిపాలైన రూ.1 కోటి విలువైన బంగారం

  • బెంగళూరులో మరోసారి వర్ష బీభత్సం
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • నేలకొరిగిన చెట్లు.. జలదిగ్బంధంలో రహదారులు
  • మల్లేశ్వరంలో బంగారం దుకాణాల్లోకి నీరు
  • బంగారం కొట్టుకుపోవడంతో లబోదిబోమంటున్న దుకాణదారులు
బెంగళూరు నగరాన్ని మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది. నగరవ్యాప్తంగా వర్షబీభత్సం కనిపించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

కాగా, బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో భారీ వర్షం కారణంగా వరద నీరు బంగారం దుకాణాల్లోకి చేరింది. దాంతో రూ.1 కోటి విలువైన బంగారు ఆభరణాలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ పరిణామంతో బంగారం దుకాణదారులు లబోదిబోమన్నారు. 

అటు, బెంగళూరును భారీ వర్షాలు వదిలేలా లేవు. కర్ణాటకలోని పలు జిల్లాలతో పాటు బెంగళూరు నగరంలో శుక్రవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.


More Telugu News