తిరుపతిలో 'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ఎప్పుడంటే..!

  • పాన్ ఇండియా సినిమాగా 'ఆదిపురుష్'
  • ప్రభాస్ సరసన నాయికగా కృతి సనన్ 
  • జూన్ 6వ తేదీన తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 16వ తేదీన ఐదు భాషల్లో సినిమా విడుదల
ప్రభాస్ హీరోగా 'ఆదిపురుష్' రూపొందింది. భారీ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జూన్ 16వ తేదీన తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 

రామాయణాన్ని కథా వస్తువుగా చేసుకుని రూపొందిన ఈ సినిమాలో, సీతారాములుగా ప్రభాస్ - కృతి సనన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖాయం చేశారు. 

జూన్ 6వ తేదీన తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా సంచలనానికి తెరతీయడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.


More Telugu News