వైఎస్ అవినాశ్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటోందా? అనే ప్రశ్నకు పురందేశ్వరి సమాధానం ఇదే!

  • అవినాశ్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదన్న పురందేశ్వరి
  • సీబీఐ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని వ్యాఖ్య
  • ఏపీలో వైసీపీ ఆగడాలు సాగవన్న బీజేపీ నేత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కొందరు నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి స్పందిస్తూ... అవినాశ్ కేసు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. సీబీఐ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని చెప్పారు. ఏపీలో వైసీపీ పాలన దారుణంగా ఉందని, ఇకపై వైసీపీ ఆగడాలు సాగవని అన్నారు. ఛార్జ్ షీట్ల ద్వారా వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. జనసేతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని తెలిపారు.


More Telugu News