మార్కెట్లో ఏది కొన్నా చెల్లింపులు మాత్రం రూ.2 వేల నోటుతోనే!
- మామిడి పండ్ల నుంచి ఖరీదైన వాచ్ ల దాకా పెద్ద నోటుతో కొనుగోలు
- పెట్రోల్ బంకుల్లోనూ రూ.2 వేల నోటే ఇస్తున్నారట
- క్యాష్ ఆన్ డెలివరీలో కస్టమర్లు పెద్ద నోటుతోనే చెల్లింపులు
మరో నాలుగు నెలల్లో రూ.2 వేల నోటు చలామణి ఆపేస్తామంటూ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించడంతో జనం తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను వదిలించుకునే పనిలో మునిగిపోయారు. బ్యాంకుల్లో మార్చుకునేందుకు, తమ ఖాతాలో జమ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించినా చాలామంది అటువైపే చూడడంలేదు. తమకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ ఉపయోగించుకుని రూ.2 వేల నోటును మార్చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మార్కెట్లో ఏది కొన్నా సరే చాలా మంది పెద్ద నోటే ఇస్తున్నారని చిన్న వ్యాపారులు చెబుతున్నారు. మామిడిపండ్ల నుంచి ఖరీదైన వాచీల దాకా వివిధ వస్తువులు కొనుగోలు చేస్తూ పెద్ద నోట్లను వదిలించుకుంటున్నారు.
పెట్రోల్ బంకుల్లో వాహనదారులు ఎక్కువగా రూ.2 వేల నోటు ఇస్తున్నారని, దీంతో చిల్లర సమస్య ఎదుర్కొంటున్నామని బంకు యజమానులు వాపోతున్నారు. రూ.2 వేల నోటు వాపస్ తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన రోజు (శుక్రవారం) నుంచి తమకు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెరిగాయని, ఎక్కువ శాతం కస్టమర్లు రూ.2 వేల నోటు ఇస్తున్నారని జొమాటో ప్రతినిధి తెలిపారు. ముంబైలోని ఓ మామిడి పళ్ల వ్యాపారి తనకు రోజూ 8 నుంచి 10 పెద్ద నోట్లు వస్తున్నాయని చెప్పారు.
వాటికి చెల్లుబాటు ఉంది కాబట్టి కాదనకుండా తీసుకుంటున్నానని, సెప్టెంబర్ 30 లోపు వాటిని తన ఖాతాలో జమ చేసుకుంటానని చెప్పారు. అయితే, మరికొంతమంది మాత్రం పెద్ద నోటును తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ముంబైకి చెందిన ఓ రెస్టారెంట్ ఓనర్ రూ.2 వేల నోటును అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. కస్టమర్ల నుంచి పెద్ద నోటు తీసుకుని, వాటిని డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగలేనని అంటున్నారు. అందుకే రూ.2 వేల నోటును తీసుకోవట్లేదని వివరించారు.
ఆన్ లైన్ లో ఖరీదైన వాచీలను, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేస్తూ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకునే వారి సంఖ్య కూడా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చాలా వరకు క్యాష్ ఆన్ డెలివరీలో కస్టమర్లు రూ.2 వేల నోటే ఇస్తున్నారని వెల్లడించాయి. బంగారం షాపులకు కూడా మూడు నాలుగు రోజులుగా రద్దీ పెరిగింది. ట్రైన్ రిజర్వేషన్లకు, బస్ టికెట్లకు.. ఇలా ఒకటేమిటి.. ఖర్చు ఏదైనా సరే చెల్లింపులు మాత్రం చాలా వరకు పెద్ద నోటుతోనే జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.