పక్కా ప్లాన్ తో చెన్నై జట్టుకు కళ్లెం వేసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్లు
- చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ క్వాలిఫయర్-1
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసిన సీఎస్కే
- రాణించిన రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే
ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. సొంతగడ్డ చెపాక్ స్టేడియంలో ధోనీ సేన వీరవిహారం చేస్తుందని ఆశించిన అభిమానులకు ఆశాభంగం కలిగింది. సీఎస్కే 200 పరుగుల మార్కు చేరుకోకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ కోసం పక్కా ప్లాన్ తో బరిలో దిగింది. చెన్నై బ్యాట్స్ మెన్ ఎక్కడా భారీ షాట్లు కొట్టకుండా నియంత్రించింది. స్లో బౌన్సర్లు, చేంజ్ ఆఫ్ పేస్, యార్కర్లతో తికమకపెట్టింది. దాంతో సీఎస్కే బ్యాట్స్ మెన్ ఎప్పుడు ఏ బాల్ వస్తుందో తెలియక భారీ షాట్లు కొట్టలేకపోయారు. కెప్టెన్ ధోనీ (1) సైతం స్లో బాల్ వలకు చిక్కుకోవడం గమనార్హం.
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే మినహా మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. గైక్వాడ్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 60 పరుగులు చేయగా, కాన్వే 34 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 87 పరుగులు చేశారు.
ఆ తర్వాత శివమ్ దూబే (1) వచ్చిన కొద్దిసేపట్లోనే వెనుదిరిగాడు. రహానే 17, రాయుడు 17, జడేజా 22 పరుగులు చేశారు. చెన్నై జట్టులోని ప్రతి బ్యాట్స్ మన్ కు గుజరాత్ టైటాన్స్ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ 2, మోహిత్ శర్మ 2, దర్శన్ నల్కండే 1, రషీద్ ఖాన్ 1, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు.