ఐపీఎల్ క్వాలిఫయర్-1కు సర్వం సిద్ధం... ఫైనల్ కు జంప్ చేసేది ఎవరో?
- నేడు చెన్నైలో మ్యాచ్
- గుజరాత్ టైటాన్స్ × చెన్నై సూపర్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
- సొంతగడ్డపై సీఎస్కే చెలరేగేనా?
ఐపీఎల్ 16వ సీజన్ లో నేటి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ నేటి క్వాలిఫయర్-1లో తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. గతేడాది ఐపీఎల్ టైటిల్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ ను నెగ్గి ఫైనల్ చేరడమే కాకుండా, మరోసారి టైటిల్ గెలవాలని కృతనిశ్చయంతో ఉంది.
ఈ మ్యాచ్ కోసం గుజరాత్ జట్టులో ఒక మార్పు చేశారు. యశ్ దయాళ్ స్థానంలో దర్శన్ నల్కండేను జట్టులోకి తీసుకున్నారు. అటు, సీఎస్కే జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ ధోనీ వెల్లడించాడు. కాగా, ఈ క్వాలిఫయర్-1 మ్యాచ్ లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్లోకి అడుగుపెడుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడాల్సి ఉంటుంది.