సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల.. టాప్ ఫోర్ ర్యాంకులు అమ్మాయిలవే!
- సివిల్స్ 2022లో 933 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ
- జనరల్ కోటాలో 345 మంది ఎంపిక
- తొలి ర్యాంకు సాధించిన ఇషితా కిశోర్
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్-2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాదికి గాను మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99 మంది, ఓబీసీ నుంచి 263 మంది, ఎస్సీ నుంచి 154, ఎస్టీ నుంచి 72 మంది ఉన్నారు. వీరిలో సివిల్స్ లో అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్ కు 180 మంది, ఐపీఎస్ కు 200 మంది, ఐఎఫ్ఎస్ కు 38 మందిని ఎంపిక చేశారు.
ఈ ఏడాది సివిల్స్ తొలి నాలుగు ర్యాంకులను అమ్మాయిలే సాధించారు. తొలి ర్యాంకును ఇషితా కిశోర్, రెండో ర్యాంకును గరీమా లోహియా, మూడో ర్యాంకును ఉమా హారతి (నారాయణపేట ఎస్పీ కుమార్తె), నాలుగో ర్యాంకును స్మృతి మిశ్రా సాధించారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే జీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకును, శ్రీసాయి అశ్రిత్ శాఖమూరి 40వ ర్యాంకును, హెచ్ఎస్ భావన 55వ ర్యాంకును, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకును సాధించి సత్తా చాటారు.