'ఘరానా మొగుడు' సినిమాకి చిరంజీవి గారు గిఫ్ట్ ఎంత ఇప్పించారంటే..!: ఫైటర్ పొన్నాంబళం
- ఫైటర్ గా మెప్పించిన పొన్నాంబళం
- 'ఘరానా మొగుడు'తో తెలుగుకి పరిచయం
- తొలి పారితోషికమే లక్షరూపాయలు
- గిఫ్ట్ గా 5 లక్షలు ఇప్పించిన మెగాస్టార్
ఒకప్పుడు తెలుగు .. తమిళ భాషల్లోని సినిమాల్లో ఫైటర్ గా పొన్నాంబళం తనదైన మార్క్ చూపించారు. అప్పట్లో ఈ రెండు భాషల్లోని స్టార్ హీరోలందరితోను కలిసి ఆయన తెరపై కనిపించారు. ఆ మధ్య మృత్యువుతో పోరాడిన ఆయన, ఆ తరువాత ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు.
"మాది చాలా పెద్ద కుటుంబం .. మా ఫాదర్ చనిపోవడంతో కుటుంబ భారం అంతా కూడా నాపైన పడింది. కొన్ని ఉద్యోగాలు చేశానుగానీ ... సినిమాలపైగల ఇంట్రెస్టుతో ఇటువైపు వచ్చాను. తెలుగులో నా ఫస్టు సినిమా 'ఘరానా మొగుడు'. ఆ సినిమాలో ఒక ఫైట్ కోసం నన్ను అడిగితే, పారితోషికంగా లక్ష రూపాయలు అడిగాను. అంత ఎమౌంట్ అడిగానని తెలిసి చిరంజీవిగారే షాక్ అయ్యారట.
"నా ఫైట్ ఎలా ఉంటుందనేది చూసిన తరువాతనే డబ్బులు ఇవ్వండి అని నిర్మాతతో చెప్పాను. అలాగే ఫైట్ బాగా వచ్చిందని చెప్పేసి లక్ష రూపాయలు ఇచ్చారు. ఆ సినిమా 175 రోజులు ఆడింది. ఆ తరువాత చిరంజీవిగారు కాల్ చేసి ఆఫీస్ కి వెళ్లి కలవమన్నారు. అక్కడికి వెళితే వాళ్లు నాకు 5 లక్షలు ఇచ్చారు. తరువాత సినిమాకి అడ్వాన్స్ అనుకున్నాను. కానీ గిఫ్ట్ గా చిరంజీవిగారు ఇవ్వమని చెప్పారని తెలిసి షాక్ అయ్యాను" అన్నారు.