కుక్క వెంటపడటంతో అపార్ట్‌మెంట్ 3వ అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ ఏజెంట్
- హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటన
- పరుపు డెలివరీ చేసేందుకు వెళ్లిన అమెజాన్ ఏజెంట్ ఇలియాస్
- ఫ్లాట్ తలుపు తెరిచి ఉండటంతో అతడి మీదకు ఉరికిన పెంపుడు కుక్క
- దాని నుంచి తప్పించుకునేందుకు 3వ అంతస్తు పిట్టగోడ నుంచి దూకేసిన యువకుడు
- బాధితుడి పరిస్థితి విషమం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటపడ్డ కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ డెలివరీ ఏజెంట్ అపార్ట్‌మెంట్ మూడవ అంతస్తు నుంచి దూకేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. పంచవటి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. అమెజాన్ కంపెనీకి చెందిన ఓ డెలివరీ ఏజెంట్ ఇలియాస్ (30) ఓ పరుపు డెలివరీ చేసేందుకు మూడవ అంతస్తులో ఉన్న ఫ్లాట్‌కు వెళ్లాడు. అయితే, ఫ్లాట్ తలుపు కొద్దిగా తెరిచి ఉండటంతో లోపలున్న డాబర్‌మ్యాన్ కుక్క డెలివరీ ఏజెంట్‌ను చూసి మొరగడం ప్రారంభించింది. ఆ తరువాత అకస్మాత్తుగా అతడిపైకి ఉరికింది.
కుక్క నుంచి తప్పించుకునే క్రమంలో ఆ వ్యక్తి పిట్టగోడ దూకేశాడు. ఇతర ఫ్లాట్లల్లోని వారు అతడిని కాపాడేందుకు వచ్చినా, ఇలియాస్‌కు పట్టుచిక్కకపోవడంతో కిందపడిపోయాడు. ఈ క్రమంలో బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఘటనపై రాయదుర్గం పోలీసులు సెక్షన్ 289 కింద కేసు నమోదు చేశారు.