ఇక్కడేదో గమ్మత్తు ఉంది... 1986 నుంచి మా నాన్నతో కశ్మీర్ వస్తున్నాను: రామ్ చరణ్
- శ్రీనగర్ లో జీ-20 సదస్సు
- ఇండియన్ సినిమా ప్రతినిధి హోదాలో హాజరైన రామ్ చరణ్
- వేదికపై తన మనోభావాలను పంచుకున్న టాలీవుడ్ అగ్రహీరో
- కశ్మీర్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుందని వెల్లడి
శ్రీనగర్ లో నిర్వహిస్తున్న జీ-20 సదస్సుకు హాజరైన టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ ఈ వేదికపై తన మనోభావాలను పంచుకున్నారు. ఈ సదస్సులో భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ చరణ్ కశ్మీర్ గురించి మాట్లాడారు. కశ్మీర్ లో ఏదో గమ్మత్తు ఉందని, కశ్మీర్ కు రావడం ఓ కలలా ఉంటుందని పేర్కొన్నారు. కశ్మీర్ మహత్మ్యం అదేనని అన్నారు.
1986 నుంచి తాను కశ్మీర్ కు వస్తుండేవాడ్నని రామ్ చరణ్ వెల్లడించారు. ఇక్కడి గుల్ మార్గ్, సోనా మార్గ్ లోని అనేక అందమైన లొకేషన్లలో తన తండ్రి చిరంజీవి అనేక చిత్రాలు షూటింగ్ జరిపేవారని గుర్తుచేసుకున్నారు. తాను కూడా 2016లో ఇక్కడ ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నానని రామ్ చరణ్ తెలిపారు. కశ్మీర్ సోయగాలు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయని అన్నారు.