శ్రీనగర్ జీ-20 సదస్సులో రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు... ఫొటోలు ఇవిగో!
- జీ-20 సదస్సు కోసం రామ్ చరణ్ కు ఆహ్వానం
- భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా హాజరైన రామ్ చరణ్
- శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సంప్రదాయ స్వాగతం
- జీ-20 వేదికపై నాటు నాటు పాటకు స్టెప్పులేసిన గ్లోబల్ స్టార్
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సదస్సులో భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రామ్ చరణ్ కు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. రామ్ చరణ్ కు కశ్మీరీ తలపాగా చుట్టారు. కాగా, జీ-20 సదస్సు వేదిక వద్ద కూడా రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. పలు దేశాల ప్రతినిధులు రామ్ చరణ్ తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
అంతేకాదు, వేదికపై రామ్ చరణ్ తన సూపర్ డూపర్ హిట్ సాంగ్, ఆస్కార్ అందుకున్న నాటు నాటు పాటకు స్టెప్పులేయడం విశేషం. ఈ సదస్సుకు హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి... రామ్ చరణ్ కు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేశారు.