సమ్మర్ ఎఫెక్ట్... తెలంగాణలో వెల్లువెత్తిన బీర్ల అమ్మకాలు
- గత కొన్నిరోజులుగా మండుతున్న ఎండలు
- వేసవితాపంతో పెరిగిన బీర్ల విక్రయాలు
- మే 1 నుంచి 18వ తేదీ వరకు 4.23 కోట్ల బీర్ల విక్రయాలు
- ప్రభుత్వానికి రూ.583 కోట్ల ఆదాయం!
వేసవిలో బీర్లు విపరీతంగా అమ్ముడవుతాయన్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలోనూ తెలంగాణలో బీర్ల అమ్మకాలు పోటెత్తాయి. గడచిన కొన్నిరోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతుండడంతో బీర్లు ఏరులై పారాయి. మే 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రికార్డు స్థాయిలో 4.23 కోట్ల ఈర్లు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క నల్గొండ జిల్లాలోనే 3.36 లక్షల కార్టన్ల బీరు తాగేశారట. ఆ తర్వాతి స్థానంలో కరీంనగర్ జిల్లా ఉంది.
కేవలం బీర్లతోనే ప్రభుత్వానికి రూ.583 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. వేసవి తాపం ఇలాగే ఉంటే మే ఆఖరి వారం వరకు బీర్ల అమ్మకాలు రికార్డులు బద్దలు కొడతాయని భావిస్తున్నారు. బీర్లతో వచ్చే ఆదాయం రూ.1000 కోట్ల మార్కు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అంచనా వేస్తున్నారు.