రీల్ లైఫ్ బాగానే ఉన్నా .. రియల్ లైఫ్ బాగా లేకుండానే గడిచిపోయింది: నరేశ్
- హైదరాబాదులో జరిగిన 'మళ్లీ పెళ్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్
- రియల్ లైఫ్ గురించి ప్రస్తావించిన నరేశ్
- తన లైఫ్ గురించి తల్లి బాధపడిందని వెల్లడి
- ఇక తాను గమ్యానికి చేరుకున్నట్టేనని వ్యాఖ్య
నరేశ్ కథానాయకుడిగా ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో 'మళ్లీ పెళ్లి' సినిమా రూపొందింది. పవిత్ర లోకేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 26వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో నరేశ్ మాట్లాడుతూ .. "నా తొమ్మిదో ఏట 'పండంటి కాపురం' సినిమాతో నటుడిగా నా ప్రయాణం మొదలైంది. అప్పుడు మేకప్ వేస్తుంటే నేను పొందిన అనుభూతిని ఇంకా మరిచిపోలేదు" అని అన్నారు.
"సీనియర్ ఆర్టిస్టుల ఆశీస్సులతో ఇంతవరకూ వచ్చాను. నా 19వ ఏట ఎవరికో మంచి చేయడం కోసం మా అమ్మ నన్ను ఒక మాట అడిగింది. అలా చేయడం వలన ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తరువాత నేను ఒకరిని కోరుకున్నాను. ఆ కలయిక సింహస్వప్నంగా మారింది. నిన్ను రాజును చేశాను గానీ .. మంచి లైఫ్ ను ఇవ్వలేకపోయానని మా అమ్మ బాధపడింది. ఇప్పుడు హ్యాపీనమ్మా .. నేను ఒక అమ్మను కలిశాను అని చెప్పాను" అన్నారు.
"ఆ తరువాత కృష్ణగారి ఆశీస్సులు తీసుకున్నాము. కృష్ణగారు - విజయనిర్మల గారు ఇద్దరూ కూడా నాకు ధైర్యాన్ని నేర్పారు. ఒక పెళ్లిలో ఆత్మీయతను .. తోడును .. నమ్మకాన్ని కోరుకుంటాము. ఈ విషయంలో ఇప్పుడు నేను నా గమ్యాన్ని చేరుకున్నాననే అనుకుంటున్నాను. ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అంటూ చెప్పుకొచ్చారు.