తల్లి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాకే విచారణకు వస్తానని సీబీఐకి అవినాశ్ రెడ్డి లేఖ
- వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్
- ఈ నెల 22న విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు
- తల్లి ఆసుపత్రిలో ఉందన్న అవినాశ్ రెడ్డి
- రేపటి విచారణకు రాలేనని వెల్లడి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నెల 16, 19 తేదీల్లో జరగాల్సిన విచారణకు అవినాశ్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఇటీవల తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ విచారణకు దూరంగా ఉన్నారు. దాంతో, ఈ నెల 22న విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది.
తాజాగా, అవినాశ్ రెడ్డి ఈ నోటీసులకు బదులిచ్చారు. తన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె డిశ్చార్జి అయ్యాకే విచారణకు వస్తానని సీబీఐకి నేడు లేఖ రాశారు. రేపటి విచారణకు తాను హాజరు కాలేనని స్పష్టం చేశారు.