అన్నమయ్య జిల్లాలో గాలి వాన బీభత్సం
- ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు
- అన్నమయ్య జిల్లాలో భారీ వర్షం, ఈదురు గాలులు
- నేలకొరిగిన స్తంభాలు... విద్యుత్ సరఫరాకు అంతరాయం
- పంటలకు నష్టం
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ సాయంత్రం అన్నమయ్య జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. రాయచోటి, రాజంపేట, గాలివీడు మండలాల్లో భారీ వర్షం అతలాకుతలం చేసింది. రామాపురం, కురబలకోట మండలాల్లో గాలులతో కూడిన వర్షం పడింది.
దాంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలివీడులో వడగళ్లు కూడా పడ్డాయి. అరటి, టమాటా, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది.
దాంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలివీడులో వడగళ్లు కూడా పడ్డాయి. అరటి, టమాటా, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది.