బుల్‌డోజర్‌కు హృదయం ఉండదు.. భయపడితే భయపెడుతుంది: ప్రకాశ్‌రాజ్

  • ‘బుల్‌డోజర్ సందర్భాలు’ పుస్తకాన్ని రాసిన ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్
  • ప్రస్తుత పాలనలో మనిషిని మనిషిగా చూడడం లేదన్న ప్రకాశ్‌రాజ్
  • నియంతృత్వం, సైనిక పాలన కొత్త పుంతలు తొక్కుతోందన్న సుప్రీంకోర్టు  మాజీ న్యాయమూర్తి
  • బలమైన నాయకుడు, రాజ్యం దేశానికి ప్రమాదకరమని వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వ పనితీరు, ప్రధాని నరేంద్రమోదీపై సునిశిత విమర్శలు చేసే సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు కె.శ్రీనివాస్ రాసిన ‘బుల్‌డోజర్ సందర్భాలు’ పుస్తకాన్ని గత రాత్రి హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో ఆవిష్కరించారు. బీబీసీ తెలుగు సంపాదకుడు జీఎస్ రామ్మోహన్, సామాజిక కార్యకర్త సజయ, మలుపు సంస్థ నిర్వాహకుడు బాల్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. బుల్డోజర్‌కు హృదయం ఉండదని, ఎదుటివారు భయపడినంతకాలం భయపెడుతూనే ఉంటుందని అన్నారు. ప్రస్తుత పాలనలో మనిషిని మనిషిగా చూడడం లేదని మోదీని ఉద్దేశించి విమర్శించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. 20వ శతాబ్దంలో నియంతృత్వం, సైనిక పాలన ఉండేవని, ఇప్పుడవి కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయని అన్నారు. బలమైన నాయకుడు, బలమైన రాజ్యం దేశానికి ప్రమాదకరమని అన్నారు.


More Telugu News