తిరుమల కొండపై అనూహ్య రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం

  • వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండపై రద్దీ
  • సర్వదర్శనానికి 40 గంటలు
  • స్వామి వారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు
వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో భక్తుల సౌకర్యార్థం స్వామి వారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగే సుప్రభాత సేవకు విచక్షణ కోటా రద్దైంది. ఫలితంగా 20 నిమిషాలు కలిస్తొంది. గురువారం తిరుప్పావడ సేవను ఏకాంతంగా నిర్వహిస్తారు. దీని వల్ల అరగంట ఆదా అవుతుంది. 

శుక్ర, శని, ఆదివారాల్లో వీపీఐ దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించరు. స్వయంగా వచ్చే వీఐపీలకే బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు. దీనివల్ల రోజూ మూడు గంటల సమయం ఆదా అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాబట్టి భక్తులు, వీఐపీలు సహకరించాలని కోరారు. కాగా, జులై, ఆగస్టు నెలలకు సంబందించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.


More Telugu News