జగన్ కు నేనో బంపర్ ఆఫర్ ఇస్తున్నా: లోకేశ్
- బనగానపల్లెలో లోకేశ్ యువగళం
- ఘనంగా 105వ రోజు పాదయాత్ర
- బనగానపల్లె సభలో లోకేశ్ ప్రసంగం
- జగన్ క్లాస్ వార్ అంటున్నాడని వెల్లడి
- వచ్చే ఎన్నికల్లో జరగబోయేది సైలెంట్ వార్ అని స్పష్టీకరణ
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 105వ రోజు బనగానపల్లె నియోజకవర్గంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. బనగానపల్లిలో యువనేత బహిరంగసభకు జనం పోటెత్తారు. ఈ సభలో లోకేశ్ ప్రసంగిస్తూ, సీఎం జగన్, వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. జగన్ 2024 లో క్లాస్ వార్ జరుగుతుంది అంటున్నాడని, కానీ రాష్ట్రంలో 2024లో జరగబోయేది సైలెంట్ వార్ అని పేర్కొన్నారు.
"జగన్ క్లాస్ వార్ అంటూ కొత్త పదాన్ని తెరపైకి తెస్తున్నారు. లక్ష కోట్ల ఆస్తి ఉన్న జగన్ పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? బెంగుళూరులో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లిలో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా? సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత మీడియా ఉన్నవాడు పేదవాడా?
జగన్ కి నేనో బంపర్ అఫర్ ఇస్తున్నా... ఉన్న లక్ష కోట్ల ఆస్తిలో 90 వేల కోట్లు ప్రజలకు పంచు లేదా ప్రభుత్వానికి ఇవ్వు. నువ్వు పేదవాడివని నేనే ఒప్పుకుంటా. పేదలు దేశంలోనే ధనిక సీఎం జగన్ ని ఓడించడమే నిశ్శబ్ద యుద్ధం. పేదరికం లేని రాష్ట్రం టీడీపీ ఎజెండా. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలి అన్నది జగన్ కల" అని లోకేశ్ పేర్కొన్నారు.
బాబాయ్ ని లేపేసినప్పటి ధైర్యం ఇప్పుడు లేదే?
వివిధ దేవాలయాలకు చెందిన సొమ్ము రూ.7 కోట్లతో జగన్ యాగాలు నిర్వహించారు. యాగాలు చేసినప్పుడు సీఎం స్థానంలో ఉన్నవాడు ఏమని కోరుకోవాలి? రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలు బాగుండాలి అని కోరుకోవాలి. కానీ బిల్డప్ బాబాయ్ జగన్ ఏమి కోరుకున్నాడో తెలుసా? శత్రువులు పోవాలి. కోర్టుల్లో గెలవాలి అని కోరుకున్నాడు. బిల్డప్ బాబాయ్ జగన్ క్రూరమైన మనస్తత్వం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి.
జీవితం అంతా పాపాలు చేసి ఇప్పుడు యాగాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? బిల్డప్ బాబాయ్ జగన్ పాపాలు పండాయి. అందుకే సీబీఐ వెంటాడుతోంది. బాబాయ్ ని లేపేసినప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు ఎందుకు లేదు? సీబీఐ అనగానే జగన్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతాడు. అవినాశ్ పారిపోతాడు.
అప్పుడు బాబాయ్ కి గుండెపోటు అన్నారు. ఇప్పుడు తల్లికి గుండెపోటు అంటున్నారు. అవినాష్ తల్లిని ఏం చేస్తాడా అని భయం వేస్తుంది. ఆ తల్లి జాగ్రత్తగా ఉండాలి అని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను
జగన్ ది దరిద్రపాదం!
చంద్రబాబు గారు మొనగాడు... జగన్ శనిగాడు. చంద్రబాబుది మంచి పాదం... జగన్ ది దరిద్ర పాదం. టీడీపీ హయాంలో నీళ్లు... జగన్ హయాంలో కన్నీళ్లు! జీవో నెం.1 తెచ్చిన ఏ1కి ఏడుపే మిగిలింది. నేను అప్పుడే చెప్పా జీవో నెం.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో ఏ1 అని.
పీకడానికి ఏమీ లేక యువగళాన్ని అడ్డుకోమని సైకో సైన్యాన్ని పంపుతున్నాడు. భయం మా బయోడేటా లో లేదు బ్రదర్. యువగళానికి అడ్డొస్తే సైకో సైన్యానికి సినిమా చూపిస్తాం. జగన్ గుంట నక్క కంటే ప్రమాదం. జగన్ ని చూస్తే తన కంటే మోసగాళ్లు ఉన్నారని గుంట నక్క సైతం ఆశ్చర్యపోవడం ఖాయం. జగన్ నిస్సిగ్గుగా పేదవాడిని అని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు.
కమీషన్ల కాటసాని దోపిడీ లీలలు
బనగానపల్లె సింహం బీసీ జనార్ధన్ రెడ్డి. మూడు నక్కలను వేటాడుతున్నాడు. బనగానపల్లెను బంగారంలా మార్చేస్తాడు అని మీరు కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించారు. కానీ ఆయన బనగానపల్లెను బొగ్గులా మార్చేసాడు. ప్రతి దాంట్లో ఆయనకు కమీషన్ ఇవ్వాల్సిందే. అందుకే ఆయన పేరు మార్చాను... కమీషన్ కాటసాని.
టీడీపీ హయాంలో జరిగిన ఉపాధి హామీ అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు క్లియర్ చెయ్యాలి అన్నా కమిషన్ కాటసాని కి 20 శాతం కప్పం కట్టాలి. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్రాంత్రాన్ని కూడా వదలలేదు కమీషన్ కాటసాని. కాలజ్ఞానం బాగా చదివితే కమీషన్ కాటసాని ఆ ప్రాంతాన్ని కబ్జా చేస్తాడని కచ్చితంగా ఉండే ఉంటుంది. ఆఖరికి బ్రహ్మం గారి గుర్తును కూడా చెరిపేశాడు ఈ కమిషన్ కాటసాని.
రవ్వల కొండ వద్ద తన బంధువు పేరుతో ఒక చోట అనుమతి తీసుకొని వేరే చోట అక్రమ మెటల్ కంకర మైనింగ్ చేసాడు కమిషన్ కాటసాని. సబ్ స్టేషన్ లో ఆపరేటర్ పోస్టులను కూడా అమ్ముకున్నాడు కమిషన్ కాటసాని. ఒక్కో పోస్టు 10 లక్షలకు అమ్మేశాడు.
చెర్లోపల్లి గ్రామంలో మైనింగ్ యజమానులపై అక్రమ కేసులు పెట్టించి వేధించాడు కమీషన్ కాటసాని. ఈయన ఎంత ముదురు అంటే, ఆ కేసులు లేకుండా చేస్తానని ఒక్కొక్కరి దగ్గర కోటి రూపాయలు కొట్టేశాడు.
*యువగళం వివరాలు:*
*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1346.6 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 16.5 కి.మీ.*
*106వ రోజు (21-5-2023) పాదయాత్ర వివరాలు:*
బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)
మధ్యాహ్నం
2.00 – అముదాలమెట్ట శివారు క్యాంప్ సైట్ లో మైనింగ్ ఓనర్లు, కార్మికులతో ముఖాముఖి.
సాయంత్రం
4.00 – ఆముదాలమెట్ట శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.15 – ఆముదాలమెట్టలో స్థానికులతో మాటామంతీ.
4.40 – చౌదరిదిన్నెలో రైతులతో సమావేశం.
5.15 – కోవెలకుంట్లలో ఎన్ఆర్ఈజిఎస్ కార్మికులతో సమావేశం.
5.30 – కోవెలకుంట్ల అమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో సమావేశం.
6.20 – కుందూనది బ్రిడ్జి వద్ద కుందూ పోరాట సమితి రైతులతో సమావేశం.
7.10 – బీమునిపాడులో స్థానికులతో మాటామంతీ.
8.30 – కంపమళ్లమిట్ట బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం.
9.50 – ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.
10.25 – దొర్నిపాడు శివారు విడిది కేంద్రంలో బస.
*******