ఈ రోజు ఎన్టీఆర్ శత జయంతి సభకు తారక్‌ దూరం.. కారణం ఇదే!

  • హైదరాబాద్ కైతలాపూర్‌‌ మైదానంలో సాయంత్రం 5 గంటల నుంచి సభ
  • ఈ రోజే తారక్‌ 40వ పుట్టిన రోజు
  • ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల తారక్‌ హాజరవడం లేదని వెల్లడి
హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సభకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు సభ మొదలవుతుంది. ఇదే రోజు తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న తారక్‌ ముందుగానే నిర్ణయించిన ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల హాజరు కావడం లేదని ఆయన తరఫున ప్రతినిధులు తెలిపారు. ఉత్సవ నిర్వహణ కమిటీ వాళ్లు తనను ఆహ్వానించడానికి వచ్చినప్పుడే తారక్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. 

కాగా, శత జయంతి ఉత్సవాలకు అగ్రశ్రేణి సినీతారలు, టీడీపీ, బీజేపీ, వామపక్ష, ఇతర పార్టీల ప్రముఖులు హాజరుకానున్నారని శత జయంతి కమిటీ కన్వీనర్ టీడీ జనార్దన రావు తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు సీతారాం ఏచూరి, డీ రాజా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఈ సభకు హాజరు కానున్నారు. కన్నడ, తెలుగు సినీ ప్రముఖులు కూడా వస్తారని నిర్వాహకులు తెలిపారు.


More Telugu News