ఇంటిని అమ్ముతూ కన్నీటి పర్యంతమైన సుందర్ పిచాయ్ తండ్రి

  • చెన్నైలో తమ పూర్వీకుల ఇంటిని అమ్మేసిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తండ్రి
  • సుందర్ ఇంటిని కొనుగోలు చేసిన తమిళ నటుడు, నిర్మాత మణికందన్
  • దస్తావేజులు తనకిస్తూ సుందర్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారని వెల్లడి
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పూర్వీకుల ఇంటిని తమిళ నటుడు, నిర్మాత సీ.మణికందన్ ఇటీవలే కొనుగోలు చేశారు. చెన్నైలోని అశోక్ నగర్‌లోగల ఇంటిని ఆయన సుందర్ పిచాయ్ తండ్రి నుంచి కొనుక్కున్నారు. ‘‘భారతదేశ పేరుప్రతిష్ఠలు సుందర్ పిచాయ్ ఇనుమడింప జేశారు. ఆయన నివసించిన ఇంటిని కొనుగోలు చేయడం నాకు గర్వకారణం’’ అని మణికందన్ పేర్కొన్నారు. 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తల్లిదండ్రుల హుందాతనం, వినయశీలత తనను మంత్రముగ్ధుణ్ణి చేశాయని మణికందన్ వ్యాఖ్యానించారు. ‘‘సుందర్ మాతృమూర్తి నాకు ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చారు. తొలి సమావేశం అవ్వగానే సుందర్ తండ్రి నాకు ఆస్తి తాలూకు దస్తావేజులు చూపించారు. ఆయన రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద గంటల తరబడి ఓపిగ్గా ఎదురు చూసి అన్ని పన్నులూ కట్టారు. దస్తావేజులు నాకిచ్చే క్రమంలో కొద్ది నిమిషాల పాటు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు’’ అని మణికందన్ చెప్పుకొచ్చారు.


More Telugu News