తిరుపతి- గుంటూరు ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల అరాచకం
- శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీ
- కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
- కిటికీల పక్కన ఉన్న మహిళా ప్రయాణికులే లక్ష్యం
తిరుపతి నుంచి గుంటూరు వెళుతున్న రైలులో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు అరాచకం సృష్టించారు. పలు బోగీల్లో కిటికీల పక్కన ఉన్న మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలను తెంపుకుపోయారు. తిరుపతి-గుంటూరు ఎక్స్ ప్రెస్ కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత రాత్రి 11.30 గంటల సమయంలో, ఎర్రగుడిపాడు రైల్వే స్టేషన్ సమీపంలో ఇది చోటు చేసుకుంది. ఒక్కసారిగా రైలు ఆగగా, ఆ వెంటనే సుమారు 20 నుంచి 25 మంది దొంగలు ఎస్1 నుంచి ఎస్6 వరకుు బోగీల్లోని మహిళా ప్రయాణికులను లక్ష్యం చేసుకున్నారు.
పలువురు ప్రతిఘటించినప్పటికీ దొంగలు దాడులకు దిగినట్టు తెలుస్తోంది. ఎంత మేర బంగారం దోపిడీకి గురైందన్న సమాచారం తెలియలేదు. ఈ దోపిడీపై ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఈ రైలుకు ఎర్రగుంట్ల నుంచి గుంటూరు వరకు భద్రత ఉంటుంది. దీంతో ఎర్రగుంట్ల రావడానికి ముందే దొంగలు దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.