కోదాడలో మెజారిటీ అంతకంటే తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఉత్తమ్ కుమార్ శపథం

  • కోదాడలో ఎన్నికల సన్నాహక సమావేశం
  • నియోజకవర్గ ఎమ్మెల్యేపై విమర్శలు
  • సొంతపార్టీ నేతలే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన
వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు 50 వేల కంటే తక్కువ మెజార్జీ వస్తే రాజకీయాల నుంచి వైదొలగుతానని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి శపథం చేశారు. కోదాడలో నిన్న ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కోదాడ ప్రస్తుత ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వెంచర్లు, వైన్స్, మట్టి, ఇసుక తవ్వకాలు సహా అన్నింటిలో వాటాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

పోలీసులు తమ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో గత నాలుగేళ్లలో ఇసుమంతైనా అభివృద్ధి జరగలేదన్నారు. సొంతపార్టీ నేతలే సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేస్తూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఉత్తమ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


More Telugu News