భారీ షాట్లు కొట్టి పంజాబ్ కు భారీ స్కోరు అందించిన షారుఖ్ ఖాన్, శామ్ కరన్
- ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ × రాజస్థాన్ రాయల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్
- రాణించిన జితేశ్, షారుఖ్, శామ్ కరన్
- నవదీప్ సైనీకి 3 వికెట్లు
రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఏ 150 పరుగులకో పరిమితం అవుతుందనుకున్న పంజాబ్ కింగ్స్ చివరికి భారీ స్కోరు సాధించింది. షారుఖ్ ఖాన్, శామ్ కరన్ భారీ షాట్లతో విజృంభించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు నమోదు చేసింది.
షారుఖ్ ఖాన్, శామ్ కరన్ జోడీ ఆఖరి 5 ఓవర్లలో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడింది. షారుఖ్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు, శామ్ కరన్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
అంతకుముందు, పంజాబ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ కూడా ధాటిగా ఆడాడు. జితేశ్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 44 పరుగులు చేశాడు. ఆఖరి 5 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 70 పరుగులు సాధించడం విశేషం.
పంజాబ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ 2, కెప్టెన్ శిఖర్ ధావన్ 17, అథర్వ తైడే 19, లియామ్ లివింగ్ స్టోన్ 9 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో నవదీప్ సైనీ 3 వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్ 1, ఆడమ్ జంపా 1 వికెట్ తీశారు.