ఊరిస్తున్న ప్లే ఆఫ్ బెర్తు... రాజస్థాన్, పంజాబ్ అమీతుమీ
- ధర్మశాలలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
- ఇరు జట్లకు ప్లే ఆఫ్ చాన్సులు
- కీలకం కానున్న ఇతర మ్యాచ్ ల ఫలితాలు
ఐపీఎల్ లో జట్లన్నీ ఇక ఒక్కో మ్యాచ్ ఆడితే లీగ్ దశ పూర్తవుతుంది. ఇప్పటివరకు జట్లు 13 చొప్పున మ్యాచ్ లు ఆడేశాయి. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే 18 పాయింట్లతో ప్లే ఆఫ్ దశలోకి ప్రవేశించింది. మిగిలిన మూడు బెర్తుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. 8వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ కు, 6వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కు కూడా కొన్ని సమీకరణాల నేపథ్యంలో ప్లే ఆఫ్ అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో, నేడు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కు ధర్మశాలలోని హెచ్ పీసీఏ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
వీపు నొప్పితో బాధపడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ లో ఆడకపోవడం రాజస్థాన్ రాయల్స్ కు ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయితే, చహల్, ఆడమ్ జంపా రూపంలో ఆ జట్టులో ప్రతిభావంతులైన లెగ్ స్పిన్నర్లు ఉన్నారు. ఇక, పంజాబ్ కింగ్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు.