మీడియా వాహనంపై అవినాశ్ అనుచరుల దాడి హేయం: చంద్రబాబు
- అవినాశ్ అనుచరులు ఏబీఎన్ వాహనాన్ని ధ్వంసం చేశారన్న చంద్రబాబు
- ఇదేనా మీ విష సంస్కృతి అంటూ ఆగ్రహం
- వాహనంపై దాడి చేస్తే అరెస్ట్ ఆగుతుందా? అంటూ ప్రశ్నించిన టీడీపీ చీఫ్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సందర్భంగా నేడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తల్లికి అనారోగ్యం అంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. అటు, ఓ మీడియా వాహనంపై దాడి జరిగింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి వార్తలు కవర్ చేస్తున్న ఏబీఎన్ మీడియా ప్రతినిధులపై ఎంపీ అనుచరులు దాడి చేశారని అన్నారు. మీడియా వాహనాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. "ఇదే మీ విష సంస్కృతికి నిదర్శనం. మీడియా వాహనంపై దాడి చేస్తే సీబీఐ వాహనం వెంటాడకుండా ఉంటుందా? అరెస్ట్ ఆగుతుందా?" అని చంద్రబాబు ప్రశ్నించారు.