మీడియాపై అవినాశ్ రెడ్డి అనుచరుల దాడి.. తీవ్రంగా ఖండించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

  • ఈ రోజు సీబీఐ విచారణకు హాజరు కాకుండా పులివెందులకు బయల్దేరిన అవినాశ్ రెడ్డి
  • ఆయన కాన్వాయ్ ని వెంబడించిన మీడియా ప్రతినిధులు
  • రెండు చానళ్ల ప్రతినిధులపై అవినాశ్ అనుచరుల దాడి
  • మీడియాపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడేనన్న తమిళిసై
  • దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఈ రోజు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తల్లి ఆరోగ్యం బాగా లేదని చెప్పి పులివెందులకు ఆయన బయలుదేరారు. అయితే అవినాశ్ కాన్వాయ్ ని అనుసరిస్తున్న రెండు మీడియా (ఏబీఎన్, హెచ్ఎంటీవీ ) చానళ్ల కార్లపై అవినాశ్ అనుచరులు దాడి చేశారు. ఓ చానల్ రిపోర్టర్ పై దాడి చేసి కెమెరా లాక్కెళ్లారు. ఓ కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటికొచ్చాయి. 

ఈ వ్యవహారాన్ని మీడియా ప్రతినిధులు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆమె.. మీడియా సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మీడియా మీద దాడి.. ప్రజాస్వామ్యంపై దాడేనన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.


More Telugu News