ఉప్పల్ లో మాస్ మసాలా సెంచరీ బాదిన క్లాసెన్
- ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసిన సన్ రైజర్స్
- 51 బంతుల్లోనే 104 పరుగులు చేసిన క్లాసెన్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ ఆర్సీబీ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ ఐపీఎల్ తో తన తొలి సెంచరీ నమోదు చేశాడు.
క్లాసెన్ మాస్ కొట్టుడు ఎలా సాగిందంటే... ఈ సఫారీ ప్లేయర్ సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగాడు. బౌలర్ ఎవరైనా సరే లెక్క చేయకుండా బెంగళూరు బౌలర్లను ఉతికారేశాడు. క్లాసెన్ 51 బంతుల్లోనే 104 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 8 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి.
ఈ ఇన్నింగ్స్ లో క్లాసెన్ కొట్టిన స్ట్రెయిట్ షాట్లు అతడి భుజబలానికి నిదర్శనంగా నిలిచాయి. బ్యాటింగ్ కు దిగింది మొదలు క్లాసెన్ బ్యాట్ ఎక్కడా విశ్రమించలేదు. దాదాపు ప్రతి ఓవర్లోనూ బంతిపై అతడి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.
ఇక, ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ జట్టులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ కూడా వేగంగా ఆడడం విశేషం. బ్రూక్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 27 పరుగులు చేశాడు. అంతకుముందు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (11), రాహుల్ త్రిపాఠి (15) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 20 బంతుల్లో 18 పరుగులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.
ఆఖరి ఓవర్లో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే కాకుండా, ఇన్నింగ్స్ చివరి బంతికి గ్లెన్ ఫిలిప్స్ ను అవుట్ చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ 2, సిరాజ్ 1, షాబాజ్ అహ్మద్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.