పశ్చిమ బెంగాల్లో 'ది కేరళ స్టోరీ' నిషేధంపై స్టే విధించిన సుప్రీంకోర్టు
- తమిళనాడులోను థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు రక్షణ కల్పించాలని ఆదేశాలు
- సినిమాలో వివాదాస్పద అంశం మార్పుపై నిర్మాతకు సూచన
- చిత్రాన్ని చూడాలనుకుంటున్నట్లు చెప్పిన సుప్రీం ధర్మాసనం
'ది కేరళ స్టోరీ' చిత్రంపై బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమిళనాడులోని థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు కూడా రక్షణ కల్పించాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సినిమాలో వివాదాస్పదంగా మారిన ఓ అంశం గురించి మార్పు చేయాలని నిర్మాతకు కూడా సూచించింది. సీబీఎఫ్‌సీ ధ్రువీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు ఈ చిత్రాన్ని ఓసారి చూడాలనుకుంటున్నట్లు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది.