సొంతగడ్డపై అభిమానులను మురిపించేందుకు సన్ రైజర్స్ కు ఆఖరి చాన్స్
- నేడు ఆర్సీబీతో తలపడుతున్న సన్ రైజర్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
- ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
ఐపీఎల్ తాజా సీజన్ లో ఆశించిన మేర రాణించని జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి. పాయింట్ల పట్టికలో చివరన ఉన్న సన్ రైజర్స్ నేడు సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
ఈ సీజన్ కు సొంతగడ్డపై సన్ రైజర్స్ కు ఇదే చివరి మ్యాచ్. ప్లే ఆఫ్ అవకాశాలు ఇప్పటికే ఆవిరి కాగా, నేడు బెంగళూరుపై నెగ్గి సొంతగడ్డపై అభిమానులను అలరించాలని సన్ రైజర్స్ టీమ్ భావిస్తోంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కు టోర్నీలో 13వ మ్యాచ్ కాగా, ఆఖరి లీగ్ మ్యాచ్ ను ఈ నెల 21న వాంఖెడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో ఆడనుంది.
ఇక, ఇవాళ ఆర్సీబీతో మ్యాచ్ కోసం సన్ రైజర్స్ టీమ్ లో బ్యాట్స్ మన్ హ్యారీ బ్రూక్, పేసర్ కార్తీక్ త్యాగిలకు స్థానం కల్పించారు. ఈ మ్యాచ్ తో నితీశ్ కుమార్ రెడ్డి ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. అటు, ఆర్సీబీ జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వెల్లడించాడు.