పేదవాళ్లను మోసం చేయడం కోసమే ఆర్-5 జోన్: చంద్రబాబు
- అమరావతిలో ఆర్-5 జోన్ పేరిట ఇతర ప్రాంతాల పేదలకు స్థలాలు
- రైతులకు, పేదలకు మధ్య చిచ్చు పెడుతున్నారన్న చంద్రబాబు
- నాడు తాము 5 శాతం భూమిని పేదలకు రిజర్వ్ చేశామని వెల్లడి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ స్ట్రాటజిక్ కమిటీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదవాళ్లను మోసగించడం కోసమే ప్రభుత్వం ఆర్-5 జోన్ ను తీసుకువచ్చిందని ఆరోపించారు. రైతులకు, పేదలకు మధ్య చిచ్చు పెట్టడమే ఈ జోన్ తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశమని విమర్శించారు.
నాడు సీఆర్డీఏ విధివిధానాల్లో భాగంగా 5 శాతం భూమిని పేదల కోసం కేటాయించడం జరిగిందని, కానీ వైసీపీ ఆర్-5 జోన్ పేరిట ఇరువర్గాల ప్రయోజనాలను కాలరాసేందుకు కుట్ర పన్నిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇరుపక్షాల మేలు కోరి టీడీపీ నిర్ణయం తీసుకుంటే, వైసీపీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు. అటు పేదలను మోసం చేయడమే కాకుండా, ఇటు రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.