అహంభావం చూపిస్తే ఎప్పుడో తొక్కేసేవారు: హాస్యనటి శ్రీలక్ష్మి

  • దశాబ్దాలుగా నవ్విస్తూ వస్తున్న శ్రీలక్ష్మి 
  • తండ్రి అనారోగ్యం వలన ఆర్ధిక ఇబ్బందులు 
  • తప్పక ఇండస్ట్రీకి వచ్చానని వెల్లడి 
  • తాను నిలదొక్కుకోవడానికి అదే కారణమని వ్యాఖ్య
హాస్యనటి శ్రీలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. దశాబ్దాల పాటు ఆమె తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ, నటిగా తిరుగులేని ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళుతున్నారు. ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"మా నాన్నగారు అమర్నాథ్ .. అప్పట్లో ఆయన హీరోగా ఒక వెలుగు వెలిగారు. ఆయన అనారోగ్య కారణాల వలన వేషాలు తగ్గుతూ వచ్చాయి. కేరక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు నేను రంగంలోకి దిగవలసి వచ్చింది. నాకు నటన తెలియదు .. అయినా అప్పుడున్న పరిస్థితుల్లో మరో మార్గం లేదు" అన్నారు. 

"అప్పట్లో సెట్లో నాపై చాలామంది సరదాగా జోకులు వేసుకునేవారు .. నేను సరదాగానే తీసుకునేదానిని. 'పాపం అమర్నాథ్ గారి అమ్మాయి .. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాల్లోకి వచ్చింది .. బాగా చేస్తోంది' అనే ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేలా నేను నడచుకున్నాను. అలా కాకుండా అహంభావానికి పోయివుంటే కనుక అప్పుడే తొక్కేసేవారు" అంటూ చెప్పుకొచ్చారు. 


More Telugu News