షర్మిలపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు
- టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ విషయంలో బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌ను దూషించారంటూ ఆ పార్టీ నేత ఫిర్యాదు
- షర్మిలపై 505 (2), 504 సెక్షన్ల కింద కేసు నమోదు
- రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తున్న షర్మిల
తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వివిధ అంశాల్లో అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై నేరుగా విమర్శల దాడి చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకు కేసులో తీవ్ర విమర్శలు చేశారు. ఇదివరకు ఈ కేసు విషయంలో టీఎస్ పీఎస్సీ ఆఫీసు ముందు, కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఆఫీసు ముందు ఆందోళన చేసేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులపై చేయి చేసుకున్నారంటూ కేసు నమోదవడంతో ఆమె జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై మరో కేసు నమోదైంది. రెండు రోజుల కిందట టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన విలేకరుల సమావేశం, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ను దూషించారంటూ ఆ పార్టీ నేత నరేందర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, పోలీసులు షర్మిలపై 505 (2), 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.