చాట్ జీపీటీ కాదు.. చాయ్ జీపీటీ!

  • ఇది చాట్ బాట్ కాదండోయ్
  • టీ తెచ్చిచ్చే అంగడి
  • తన టీ స్టాల్ కు చాయ్ జీపీటీ బోర్డు పెట్టిన వ్యక్తి
  • ఇంటర్నెట్ లో వైరల్
సృజనాత్మకత ఉంటే చాలు, తమదైన ప్రత్యేక గుర్తింపును సులభంగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఓ టీ వర్తకుడు చేసిన పని ఇదే విధంగా ఉంది. ఇటీవల మనం చాట్ జీపీటీ గురించి తెగ వింటున్నాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ/కృత్రిమ మేథ) ఆధారంగా పనిచేసే అప్లికేషన్ ఇది. మనం ఏ సమాచారం కోరినా తెచ్చివ్వగల నేర్పరి. గూగుల్ సెర్చ్ కంటే సమర్థవంతమైన ఈ నూతన టెక్నాలజీ ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తోంది. 

దీంతో చూసిన వెంటనే చాట్ జీపీటీ గుర్తుకు వచ్చే విధంగా.. చాయ్ జీపీటీ అని తన టీ కొట్టుకి బోర్డు తగిలించాడో తెలివైన వర్తకుడు. చాయ్ జీపీటీ. ఇది చాట్ బాట్ కాదు. కప్పు టీ తెచ్చిచ్చేది అన్నట్టుగా తన చర్యతో సందేశాన్నిచ్చినట్టయింది. స్వాతి అనే ట్విట్టర్ యూజర్ ఇందుకు సంబంధించిన ఫొటోని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘సిలికాన్ వ్యాలీ: మా దగ్గర మెరుగైన స్టార్టప్ ఐడియాలు ఉన్నాయి’’ అని స్వాతి పేర్కొన్నారు. మొత్తానికి టీ వర్తకుడు తన చర్యతో టెక్ తరం వారిని ఆకర్షించాడు.


More Telugu News