హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. పెట్టుబడులకు ముందుకొచ్చిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్
- నగరంలో అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న వార్నర్ బ్రదర్స్
- తొలి ఏడాదిలో 1200 మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు
- ఏఎస్‌సీఈలో మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రసంగం
హైదరాబాద్ సిగలో మరో మణిహారం తళుకులీనబోతోంది. అంతర్జాతీయ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. నగరంలో అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం (ఐడీసీ) ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ అక్కడ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) అలెగ్జాండ్ర కార్టర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆమెకు వివరించారు.
హైదరాబాద్‌లో వార్నర్ బ్రదర్స్ ఏర్పాటు చేసే ఐడీసీ సెంటర్ ద్వారా తొలి ఏడాదిలో 1200 మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు దక్కనున్నట్టు కేటీఆర్ తెలిపారు. కాగా, అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్‌సీఈ) ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 25 వరకు జరగనున్న ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు కేటీఆర్ అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై అక్కడ కేటీఆర్ ప్రసంగిస్తారు.