వరుసగా రెండో రోజు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

  • ప్రాఫిట్ బుకింగ్ తో నిన్న, నేడు నష్టపోతున్న మార్కెట్లు
  • అదరగొట్టిన బీఎస్ఈ స్మాల్ క్యాప్
  • డాలర్ మారకంతో 13 పైసలు క్షీణించిన రూపాయి
స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు, రోజంతా అదే బాటలో నడిచాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ మాత్రమే అదరగొట్టింది. మిగతా అన్నీ కూడా భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 371 పాయింట్లు నష్టపోయి 61,560 పాయింట్ల వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు క్షీణించి 18,181 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు రోజులుగా ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక మార్కెట్ ముగిసే సమయానికి డాలర్ మారకంతో రూపాయి 13 పైసలు క్షీణించి 82.38 వద్ద నిలిచింది.


More Telugu News