అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి: చంద్రబాబు తీవ్ర హెచ్చరిక

  • ఇరువర్గాల ఘర్షణపై ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు
  • లోకేశ్ పాదయాత్ర నంద్యాలలోకి ప్రవేశించిన సమయంలో ఘర్షణ
  • ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల వర్గీయుడి దాడి.. సర్ది చెప్పిన పోలీసులు
  • అఖిలప్రియను అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించిన పోలీసులు
పార్టీలోని విభేదాలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ అంశాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. బుధవారం ఆయన ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఘటనపై సీనియర్లతో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు, సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. యువగళం పాదయాత్రకు స్వాగత ఏర్పాట్ల సమయంలో జరిగిన వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ వర్గానికి చెందిన వారు కొట్టారు. వెంటనే కలుగజేసుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. ఈ ఘటన అనంతరం బుధవారం ఉదయం అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.


More Telugu News