ఆసియాలో అత్యంత పాప్యులర్ స్పోర్ట్స్ టీమ్.. సీఎస్కే

  • మార్చి నెలకు సంబంధించి అత్యధిక ఇంటరాక్షన్స్
  • చెన్నై జట్టుకు అత్యధికంగా 95 లక్షల మంది ఫాలోవర్లు
  • మూడో స్థానంలో ఆర్సీబీ.. నాలుగో స్థానంలో ముంబై ఇండియన్స్
చెన్నై సూపర్ కింగ్స్ కు ఉన్న క్రేజే వేరు. ఐపీఎల్ లో 10 ఫ్రాంచైజీలు ఉన్నప్పటికీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న జట్లలో చెన్నై ముందుంటుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో చెన్నై జట్టు మైదానంలోకి దిగితే చాలు.. చుట్టూ ఉన్న ప్రేక్షకులు, అభిమానులు తెగ సందడి చేస్తుంటారు. ఇప్పుడు చెన్నై జట్టు ఆసియాలోని క్రీడా జట్లలో అత్యంత ప్రజాదరణ కలిగినదిగా మొదటి స్థానంలో నిలిచింది. మార్చి నెలకు సంబంధించి ట్విట్టర్ లో అగ్ర స్థానంలో ఉంది. ఈ జట్టుకు సంబంధించి 51.2 లక్షల ఇంటరాక్షన్స్ నమోదయ్యాయి. 

ట్విట్టర్ లో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాండిల్ కు 95 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ జాబితాలో సౌదీ అరేబియా ఫుట్ బాల్ క్లబ్ (సౌదీ ప్రో లీగ్) ఆల్ నస్సార్ రెండో స్థానంలో ఉంది. గత డిసెంబర్ లో క్రిస్టియానో రొనాల్డో ఇందులో చేరిపోవడంతో పాప్యులారిటీ పెరిగిపోయింది. మార్చి నెలలో ఈ క్లబ్ కు సంబంధించి 50 లక్షల ఇంటరాక్షన్స్ జరిగాయి. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. 

ఆర్సీబీకి సంబంధించి 34.5 లక్షల ఇంటరాక్షన్స్ నమోదయ్యాయి. 66 లక్షల మంది ట్విట్టర్ లో బెంగళూరు జట్టును ఫాలో అవుతున్నారు. ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ కు సంబంధించి ట్విట్టర్ లో మార్చి నెలలో 27.4 లక్షల ఇంటరాక్షన్స్ నమోదయ్యాయి. ముంబై ఇండియన్స్ కు 81 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. జాబితాలో ఐదో స్థానంలో మరో సౌదీ ప్రో లీగ్ ఎస్ఎఫ్ సీ ఉంది.


More Telugu News