'కస్టడీ' 5 రోజుల వసూళ్లు ఇవే!
- వెంకట్ ప్రభు రూపొందించిన 'కస్టడీ'
- చైతూ జోడీకట్టిన కృతి శెట్టి
- బలహీనమైన ఓపెనింగ్స్ తో మొదలైన సినిమా
- 5 రోజుల్లో 12.50 కోట్ల గ్రాస్ వసూలు
- బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలో ఉన్న సినిమా
ఈ మధ్య కాలంలో నాగచైతన్య తనకి అచ్చొచ్చిన జోనర్లో 'థ్యాంక్యూ' సినిమా చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా, అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తరువాత సినిమా పూర్తి యాక్షన్ నేపథ్యంలో ఉండేలా చూసుకుని ఆయన 'కస్టడీ' సినిమాను చేశాడు. అయితే ఈ సినిమా అంతకంటే దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో .. శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో చైతూ 'కస్టడీ' సినిమాను చేశాడు. ఆయనతో పాటు కలిసి 'బంగార్రాజు' సినిమాలో సందడి చేసిన కృతి శెట్టిని కథానాయికగా తీసుకున్నారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. బలహీనమైన ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12.50 కోట్ల గ్రాస్ ను .. 5.83 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చేరుకోవాలంటే ఇంకా 19.17 కోట్లను రాబట్టవలసి ఉంటుంది. అయితే ఆ అవకాశాలు కనిపించడం లేదు. కథను పట్టుగా రాసుకోకపోవడం .. పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడమే ఈ సినిమా ఇంతగా నిరాశపరడానికి కారణాలుగా చెప్పుకోవాలి.