బజరంగ్‌ దళ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • హిందుత్వ పేరుతో దాడులకు పాల్పడడాన్ని అంగీకరించబోమన్న దిగ్విజయ్
  • బజరంగ్ దళ్‌ను గూండాల సమూహంగా అభివర్ణించిన కాంగ్రెస్ నేత
  • హిందూత్వ అంటే ఏకీభవించని వారిపై దాడులు చేయడమే దాని పనని వ్యాఖ్యలు
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో హిందుత్వ సంస్థ బజరంగ్‌ దళ్‌పై కాంగ్రెస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వేడి చల్లారకముందే ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. మధ్యప్రదేశ్‌లోని జగదల్‌పూర్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. హిందూత్వ అనేది ధర్మం కాదని అన్నారు. ఆ పేరుతో దాడులకు పాల్పడడాన్ని తాము అంగీకరించబోమన్న ఆయన.. బజరంగ్‌ దళ్‌ను గూండాల గ్యాంగ్‌గా అభివర్ణించారు.

మనది సనాతన ధర్మమని, హిందూత్వను తాము ధర్మంగా పరిగణించబోమని స్పష్టం చేశారు. హిందూత్వ అంటే తమతో ఏకీభవించని వారిపై కర్రలతో దాడిచేయడం, ఇళ్లు కూల్చేయడం, డబ్బు దోచుకోవడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ బజరంగ్ దళ్‌ను బజరంగ్ బలి (హనుమంతుడు)తో పోల్చడం బాధాకరమని దిగ్విజయ్ అన్నారు.


More Telugu News