కేరళ స్టోరీ సినిమాను చూసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  • వాస్తవానికి దగ్గరగా తీసిన సినిమా అని వ్యాఖ్య
  • దేశంలో కొంతమంది మతం పేరుతో కుట్ర చేస్తున్నారన్న కిషన్
  • కేరళలో ఏళ్లుగా జరుగుతున్నదానిని ఈ సినిమాలో చూపించారన్న కేంద్రమంత్రి
ది కేరళ స్టోరీ సినిమా వాస్తవానికి దగ్గరగా తీసిన సినిమా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని నారాయణగూడ శాంతి థియేటర్ లో బీజేపీ శ్రేణులతో కలిసి కిషన్ రెడ్డి సినిమాను చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో కొంతమంది మతం పేరుతో కుట్ర చేస్తున్నారని, అలాంటి ఘటనలను అందరూ ఖండించాలన్నారు. 

ది కేరళ స్టోరీ గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి, సినిమాను చూడాలనుకున్నానని, కార్యకర్తల కోరిక మేరకు వారితో కలిసి చూశానని చెప్పారు. కేరళ రాష్ట్రంలో చాలా ఏళ్లుగా ఈ సినిమాలో చూపించిన ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మహిళలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఏ రకంగా హింసిస్తున్నారో.. ఎలా మతమార్పిడి చేస్తున్నారో ఇందులో చూపించారన్నారు.


More Telugu News