ఈ మ్యాచ్ లో గెలిస్తే ముంబయి ఇండియన్స్ సేఫ్
- ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- లక్నోలో అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- ఈ మ్యాచ్ గెలిస్తే 16కి పెరగనున్న ముంబయి పాయింట్లు
ఇవాళ ముంబయి ఇండియన్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్ నేటి మ్యాచ్ లో గెలిస్తే 16 పాయింట్లతో సురక్షితమైన స్థితికి చేరుతుంది. ప్లే ఆఫ్ బెర్తుకు మరింత చేరువ అవుతుంది.
ఈ నేపథ్యంలో, లక్నో సూపర్ జెయింట్స్ పై సర్వశక్తులు ఒడ్డి పోరాడాలని ముంబయి ఇండియన్స్ భావిస్తోంది. ఈ మ్యాచ్ కు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి ఏకానా స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఛేజింగ్ చేయడానికే మొగ్గు చూపింది.
ఈ మ్యాచ్ కోసం ముంబయి ఇండియన్స్ ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షోకీన్ ను తుదిజట్టులోకి తీసుకుంది. అటు, లక్నో జట్టులో కైల్ మేయర్స్, అవేష్ ఖాన్ ల స్థానంలో దీపక్ హుడా, నవీనుల్ హక్ లను తీసుకున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా ఈ మ్యాచ్ లో నెగ్గడం అత్యవసరం. ఆ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడి, 6 విజయాలు సాధించి 13 పాయింట్లతో కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్ తో పాటు మరో మ్యాచ్ కూడా ఆడాల్సి ఉన్న లక్నో జట్టు రెండు మ్యాచ్ ల్లో నెగ్గితే 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.