భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ 413 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్లు డౌన్
- స్వల్ప లాభాల్లో ముగిసిన బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్
- ఆటో సూచీలు డౌన్, పీఎస్‌యు బ్యాంకింగ్ అప్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 413 పాయింట్లు నష్టపోయి 61,932 పాయింట్ల వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు క్షీణించి 18,286 పాయింట్ల వద్ద ముగిశాయి. 1790 షేర్లు లాభాల్లో, 1627 షేర్లు నష్టాల్లో ముగియగా, 132 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి.
హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్ టాప్ లూజర్స్ గా నిలవగా; బీపీసీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఆటో ఇండెక్స్ 1 శాతం నష్టపోగా, హెల్త్ కేర్, ఇన్ఫ్రా, బ్యాంకింగ్, మెటల్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ సూచీ స్వల్పంగా లాభపడింది. ఇక, డాలర్ మారకంతో భారత కరెన్సీ రూపాయి 82.21వద్ద ముగిసింది. నిన్న ఇది 82.30 వద్ద ముగిసింది.