'క్రాక్' సినిమా వెంకీ చేయవలసిందట!
- వెంకటేశ్ తో 'బాడీగార్డ్' చేసిన గోపీచంద్ మలినేని
- 'క్రాక్' కథను కూడా వెంకీకే వినిపించిన దర్శకుడు
- వేరే కమిట్మెంట్స్ కారణంగా చేయలేకపోయిన వెంకీ
- రవితేజతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని
రవితేజ హీరోగా ఆ మధ్య వచ్చిన 'క్రాక్' సినిమా ఘనవిజయాన్ని సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. బలమైన కథాకథనాలు .. డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇది నిలిచింది.
అయితే ఈ సినిమా వెంకటేశ్ చేయవలసిందట. గతంలో వెంకటేశ్ తో గోపీచంద్ మలినేని 'బాడీగార్డ్' సినిమాను చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన 'క్రాక్' కథను ముందుగా ఆయన వెంకటేశ్ కి వినిపించారట. అయితే ఆ సమయంలో తనకి గల కమిట్ మెంట్స్ కారణంగా వెంకటేశ్ చేయలేదని సమాచారం.
వెంకటేశ్ అందుబాటులో లేకపోవడంతో, వెంటనే గోపీచంద్ మలినేని ఆ కథను రవితేజకి వినిపించాడట. అప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'డాన్ శీను' .. 'బలుపు' సినిమాలు హిట్ అయ్యాయి. అందువలన వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా రవితేజ ఒప్పుకోవడం వలన, ఇద్దరికీ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పండింది.