సీఎం పదవిపై వీడని సస్పెన్స్, ఖర్గేతో రాహుల్ గాంధీ చర్చలు
- మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లిన రాహుల్ గాంధీ
- కీలక భేటీలో పాల్గొన్న రణ్‌దీప్ సుర్జేవాలా
- గెలిచిన ఎమ్మెల్యేలతోను సమావేశమైన రాహుల్, ఖర్గే
కర్ణాటకలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రేసులో మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే ఇద్దరూ ఎవరికి వారు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నిన్ననే పూర్తి కావాల్సిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఇప్పటికీ పూర్తి కాలేదు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు.
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఖర్గే నివాసానికి వెళ్లిన రాహుల్ గాంధీ ఆయనతో చర్చలు జరిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సుర్జేవాలా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఖర్గే, రాహుల్, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో పాటు కర్ణాటక నుంచి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కూడా సమావేశమయ్యారు. కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముగ్గురు పరిశీలకులను నియమించింది.