ఈ సినిమాకి హీరో నేను కాదు: 'స్పై' ప్రెస్ మీట్లో నిఖిల్
- నిఖిల్ నుంచి వస్తున్న 'స్పై'
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- కథానాయికగా కనిపించనున్న ఐశ్వర్య మీనన్
- జూన్ 29వ తేదీన ఐదు భాషల్లో విడుదల
నిఖిల్ మొట్టమొదటిసారిగా .. పూర్తిస్థాయి యాక్షన్ మూవీగా 'స్పై' చేశాడు. రాజశేఖరరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. జూన్ 29వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
ఈ వేదికపై నిఖిల్ మాట్లాడుతూ .. "ఎన్ని హిట్లు ఇచ్చినా ప్రతి సినిమాను మళ్లీ కొత్తగా మొదలుపెట్టవలసిందే .. అది కొత్తగా ఉండవలసిందే. అలా చేసిన సినిమానే 'స్పై' .. ఇది యాక్షన్ థ్రిల్లర్. సుభాష్ చంద్రబోస్ కి సంబంధించి తెలియని కొన్ని విషయాలను ఈ సినిమాలో ప్రస్తావించడం జరిగింది" అని అన్నాడు.
"ఈ సినిమాలో హీరో నేను కాదు .. కథ. అవును ఇటీవల కాలంలో ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఆర్టిస్టులు బాగా చేశారని చెప్పుకుంటున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా ఇది. టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుండటంతో, టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమాను చూశామనే ఫీల్ తో బయటికి వస్తారు" అని చెప్పుకొచ్చాడు.