వీటిని దూరం పెట్టేస్తే.. సంపూర్ణ జీర్ణారోగ్యం
- మన శరీరంలో జీర్ణాశయ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం
- పేగుల్లో మంచి బ్యాక్టీరియాకి హాని చేయని ఆహారం తీసుకోవాలి
- చక్కెరలు, వెజిటబుల్ నూనెలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి
మనం తీసుకుంటున్న ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మన జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి. జీర్ణకోశం అన్నది అతిపెద్ద ట్యూబ్. నోటి చివరి నుంచి మొదలు మలాశయం వరకు అంతర్గతంగా కొనసాగుతుంది. జీర్ణ వ్యవస్థలో ఇది ముఖ్యమైనది. మనం తీసుకున్న ఆహారం విచ్ఛిన్నమై, అందులోని పోషకాలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ను మన శరీరానికి పట్టేలా చేస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. ప్రత్యేకమైన వ్యాధి నిరోధక కణాలు కూడా ఉంటాయి. కనుక వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండడంలో దీని పాత్ర కూడా ఉంటుంది. ఇందులోని మంచి బ్యాక్టీరియా ఆరోగ్యానికి సాయపడుతుంది. కనుక జీర్ణాశయం, జీర్ణకోశం ఆరోగ్యం ఉండేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరంగా పెట్టడం ఎంతో అవసరం.
పంచదార
పేగులు/ జీర్ణకోశంలోని మంచి బ్యాక్టీరియాకు చక్కెర శత్రువులా పనిచేస్తుంది. దీంతో శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ కు దారితీస్తుంది. రిఫైన్డ్ షుగర్ ను ఎక్కువగా తీసుకుంటుంటే పేగుల్లో హానికారక బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. దాంతో మంచి చేసే బ్యాక్టీరియా తగ్గుతుంది. మంచి, చెడు బ్యాక్టీరియా మధ్య బ్యాలన్స్ తప్పుతుంది.
కృత్రిమ చక్కెరలు
కృత్రిమ పదార్థాలను జీర్ణం చేసేందుకు మన శరీరాల నిర్మాణం జరగలేదు. కృత్రిమ తీపి పదార్థాలు వ్యాధి నిరోధక శక్తి స్పందించేలా చేస్తాయి. దీంతో శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ పెరుగుతుంది. యాస్పర్ టేమ్, సుక్రలోజ్ వల్ల పేగుల్లో చెడు ప్రభావాలు ఏర్పడతాయి. పేగుల్లోని బ్యాక్టీరియా రూపాన్ని మార్చేస్తాయి. సమతుల్యత లోపిస్తుంది.
శాచురేటెడ్ ఫ్యాట్స్
ఫ్రైడ్ ఫుడ్స్ లో శాచురేటెడ్ కొవ్వులు అధికం. ఇవి జీర్ణానికి కష్టమైనవి. అనారోగ్యకర కొవ్వులతో కూడిన ఆహారం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ పెరుగుతుంది. జీర్ణాశయ సమస్యలు పెరుగుతాయి.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్
వీటిల్లో ఉప్పు, ఫ్యాట్, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి. పేగుల్లోని బ్యాక్టీరియా మధ్య సమతుల్యం లోపించి ఇన్ ఫ్లమ్మేషన్ కు కారణం అవుతుంది. ఇంకా వీటిల్లో అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి.
వెజిటబుల్ ఆయిల్
వేరుశనగ, సన్ ఫ్లవర్, శాఫ్లవర్, కాటన్ సీడ్, పామాయిల్, కనోలా, ఆలివ్ ఇవన్నీ కూడా వెజిటబుల్ నూనెలే. వీటిల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ - ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మధ్య రేషియో ఎక్కువ. దీంతో ఇన్ ఫ్లమ్మేషన్ పెరుగుతుంది.
ఆల్కహాల్
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే పేగుల్లోని ఆరోగ్యం దెబ్బతింటుంది. బ్యాక్టీరియా అధిక వృద్దికి కారణమవుతుంది. జీర్ణకోశ గోడలను దెబ్బతీస్తుంది. పోషకాలను గ్రహించే శక్తిని తగ్గిస్తుంది. కాలేయ వ్యాధులకూ కారణమవుతుంది.
ఫైబర్
పీచు ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. పీచు లేని వాటిని తీసుకుంటే పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి బ్యాక్టీరియా తగ్గుతుంది. ఫైబర్ అన్నది ప్రీబయాటిక్ గా పనిచేస్తుంది. పేగుల్లోని బ్యాక్టీరియాకు ఇది ఆహారంగా పనిచేస్తుంది.