ఆహ్వానపత్రికలో ఎన్టీఆర్ పేరు లేదు .. అయినా ఆయన వచ్చేశారు: నటి జయచిత్ర

  • ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగానన్న జయచిత్ర 
  • ఆయనతో చేసిన ఫస్టు మూవీ 'మా దైవం' అని వెల్లడి 
  • హైదరాబాదులో తన సన్మానం గురించిన ప్రస్తావన 
  • అది ఎన్టీఆర్ గారి గొప్పతనమని వ్యాఖ్య  
తెలుగు తెరపై మెరిసిన అలనాటి కథనాయికల జాబితాలో జయచిత్ర పేరు కూడా కనిపిస్తుంది. ఎన్టీ రామరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తూ పెరిగిన దానిని నేను. చిన్నప్పుడు 'గుండమ్మ కథ' .. 'నర్తనశాల' .. 'మిస్సమ్మ' సినిమాలను ఎక్కువగా చూశాను" అన్నారు. 

"ఎన్టీఆర్ గారితో కలిసి నటిస్తానని కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఆయనతో నేను చేసిన ఫస్టు సినిమా 'మా దైవం'. ఆ సినిమాలో ఆయనతో కలిసి నటించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రేక్షకులకు మాత్రమే కాదు .. మాకు కూడా ఆయనే రాముడు .. ఆయనే కృష్ణుడు. అలాంటి రూపం .. వాచకం ... నడక ఎక్కడ చూస్తాం?" అన్నారు. 

"నేను 100 సినిమాలు పూర్తిచేసినప్పుడు చెన్నైలోని పెద్దలంతా నాకు సన్మానం చేశారు. హైదరాబాదు - రవీంద్రభారతిలో కూడా ఒక సంస్థ వారు నాకు సన్మానాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్వాన పత్రికలో రామారావుగారి పేరు లేదు. అయినా నేను సాహసించి ఆయనకి కాల్ చేశాను. సాయంత్రం 6:30 నిమిషాలకి ప్రోగ్రామ్ అంటే, 5:30 నిమిషాలకు ఆయన కారు దిగిపోయారు. అది చూసి ఆర్గనైజర్లు కంగారుపడిపోయారు" అంటూ చెప్పుకొచ్చారు. 



More Telugu News