మరో 500 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్
- 9 వేల మందిని తొలగిస్తామంటూ మార్చిలో సీఈవో లేఖ
- తాజా లే ఆఫ్ లు అందులో భాగమే అంటున్న కంపెనీ వర్గాలు
- దేశంలో ఈ కామర్స్ రంగం మందగించడమే కారణమని వివరణ
ప్రముఖ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. భారత దేశంలో వివిధ స్థాయులలో పనిచేస్తున్న ఈ ఉద్యోగులకు మంగళవారం పింక్ స్లిప్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థ ఉద్యోగులలో 18 వేల మందిని తొలగించనున్నట్లు అమెజాన్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. దశలవారీగా తొలగింపులు చేపడతామని వివరించింది. ఈ కామర్స్ రంగంలో మందగమనం కారణంగా మానవ వనరులను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
ఇందులో భాగంగా 9 వేల మంది ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించినట్లు సంస్థ సీఈవో అండీ జెస్సీ మార్చిలో ప్రకటించారు. వెబ్ సర్వీసులు, హ్యూమన్ రిసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్ మెంట్ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులను దశలవారీగా తొలగిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే భారత్ లో పనిచేస్తున్న 500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం.